గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం కడియం మండలం వీరవరం గ్రామంలో జరిగిన 'పల్లె పండుగ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.