గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ విధానం అమలులో మరిన్ని సంస్కరణలను తీసుకుని రావడం జరిగిందని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వినియోగదారులకి, ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు, ఇతర నిర్మాణ, అభివృద్ది పనులను చేపట్టేందుకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.