2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 2025లో జరిగే పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి నవంబర్ 21వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ ఆర్‌ఐవో నరసింహం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు అపరాధ రుసుం లేకుండా నవంబర్ 21వ తేదీ, 22 నుండి డిసెంబర్ 5 వరకు రూ. 1000 లు అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవలసి ఉంటుందన్నారు.