గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రోడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఎక్కడ చూసినా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కడియం మండలం కడియపుసావరంలో జరిగిన 'మిషన్ పాటొల్ ఫ్రీ ఏపీ' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వాహనదారులకు ఇబ్బందులు తొలగించే విధంగా గుంతలు పూడ్చే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.