రాజమండ్రి రూరల్ లో రక్షణ సైన్యము ఆధ్వర్యంలో ఆదివారము పేదలకు ఉచిత వైద్య శిబిరము లాలా చెరువు నందు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో ఉన్న డెల్టా హాస్పిటల్ ఆధ్వర్యంలో పేదలకు వైద్య పరీక్షలు చేసి వారికి ఉచితముగా మందులు ఇచ్చారు. అలాగే 150 మందికి బిపి, షుగర్, ఇసిజి పరీక్షలు చేసి కొంతమందికి ఉచితముగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ విల్సన్ బొద్ధుల, మేయర్ పద్మ విల్సన్, కెప్టెన్ గాంధీ, ఉషారాణి, గిద్యోన్ పాల్గొన్నారు.