రాజమండ్రి రూరల్లో అనేక ప్రజాసమస్యలు పేరుకుపోయి ఉన్నాయని వీటిపై సిపిఐ దశలవారీ పోరాటం నిర్వహిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య తెలిపారు. మంగళవారం ఉక్కుంపేట పంచాయతీ వరలక్ష్మి నగర్లో హై పవర్ టవర్ వేయడంపై సిపిఐ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజా సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని రూరల్ గ్రామాలలో మంచినీటి కొరత కూడా తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో హై పవర్ టవర్లు వేయకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి నల్ల రామారావు, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు నగర సహాయ కార్యదర్శి వి కొండలరావు, నగర కార్యవర్గ సభ్యులు బొమ్మ సానిరవిచంద్ర ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, తదితరులు పాల్గొన్నారు.