కాకినాడ జిల్లా, సామర్లకోట గణేష్ కాలనీలో నిర్మిస్తున్న ఎఫ్. ఎస్. టీ. పి ప్లాంట్ ను నిర్మాణ పనులు ఆపాలని గణేష్ కాలనీకి చెందిన స్థానికులు గురువారం సామర్లకోట పురపాలక సంఘం కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఎఫ్. ఎస్. టీ. పి ప్లాంట్ ను నిర్మాణాన్ని తక్షణం విరమించుకుని వేరే చోటికి మార్చుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.