రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కందులు దుర్గేష్ సూచించారు. శుక్రవారం తూ. గో జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని అన్నారు.