మండపేట పట్టణ పరిధిలో ఈ నెల 22 నుండి 25 వరకు ఆధార్ నమోదు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మండపేట మునిసిపల్ కమిషనర్ టి. వి రంగారావు సోమవారం పేర్కొన్నారు. ఈ కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22, 23 తేదీల్లో విజ్ఞాన్ విద్య సంస్థలో కేంద్రం నిర్వహిస్తారు. ఈ నెల 24న న్యూ కాలనీలోని అంగాన్వాడి కేంద్రంలో, 25న గాంధీనగర్ 13వ సచివాలయంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.