గోదావరి పుష్కరాలు-2027కి సంబంధించి కొవ్వూరులో ఉన్న గోదావరిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి బుధవారం పరిశీలించారు. జరగబోయే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సుస్మిత రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.