తూ. గో జిల్లా కొవ్వూరు మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ లో వివిధ మరమ్మతులు నిమిత్తం పట్టణంలో గురువారం సాయంత్రం తాగునీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్టు కమిషనర్ టి. నాగేంద్రకుమార్ బుధవారం తెలిపారు. మళ్ళీ 18వ తేదీ ఉదయం నుంచి తాగునీటి సరఫరా యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని పట్టణ వాసులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.