నవంబర్ 4వ తేదీన తిరుమల తిరుపతి దేవ స్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అఖండ గోదావరి హారతి కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్డీవో సుస్మిత రాణి అన్నారు. ఈ మేరకు బుధవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో గోదావరి హారతి పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో శాఖల వారిగా కేటాయించిన ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలన్నారు.