ప్రజా సమస్యల పరిష్కారం కోసం నవంబరు 8 నుంచి 15వ తేదీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరు నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు శేషా బాబ్జి, కే సత్తిరాజు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రజా పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8న కాకినాడ కలెక్టరేట్ వద్ద ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.