రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనితను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించడం సరికాదని ఉమ్మడి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కొండేపూడి శ్యాంబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ ధర్మచౌక్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాకినాడ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర హోం మినిస్టర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.