పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ టెంపుల్ టూరిజంతో పాటు.. ఎకో టూరిజం అభివృద్ధి ద్వారా సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర పర్యాటకరంగ అభివృద్ధి అధికారులతో కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే స్థాపించిన టూరిజం కేంద్రాల నిర్వహణ స్థితిగతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోటిపల్లి, పాశర్లపూడి, ఆదూరు, అంతర్వేది, ఎస్ యానం, దిండిలలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు విశేషంగా ఆకర్షితులయ్యే దిశగా పర్యాటకరంగ అభివృ ద్ధికి యోచన చేస్తున్నట్లు తెలిపారు.