దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనినరిగా తీసుకోవాలని కిర్లంపూడి ఎస్ఐ జి. సతీష్ సూచించారు. రెవెన్యూశాఖ నుంచి వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. విక్రయదారులు, గోదాముల నిర్వాహకులు విధిగా ఫైర్ సెఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.