గోపాలపురం మండలం నుంచి వాదాలకుంట వెళ్లే మార్గ మధ్యలో పంచాయతీ పైప్‌లైన్ పగిలిపోయింది. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలపురం వైపు నుంచి వాదాలకుంట వైపు భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.