కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేద మహిళలకు ప్రతి ఏట మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం ఏర్పాటుచేసిన దీపం పథకం 2. 0 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.