గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో గంగానమ్మ ఆలయం ప్రక్కన వినాయకుని మండపం ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారని ఉత్సవ కమిటీ వ్యవస్థాపకులు ఎపూరి సత్తిబాబు అన్నారు. విగ్రహా దాతగా వంగరాజు దంపతులు ఉన్నారని ఈ ఉత్సవాలు గత పది సంవత్సరాలు నుంచి జరుగుతున్నామని ఉత్సవ కమిటీ వారు తెలిపారు.