నల్లజర్ల పంచాయతీ ఆవరణలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మద్దిపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ పాత బకాయిలతో సహా పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, మండల అధికారులు ఉన్నారు.