తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. బుధవారం విజయవాడలో మంత్రి నారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఉద్యోగ సిబ్బంది కొరత ఉందని. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరారు.