ఈ నెల అక్టోబర్ 14 నుండి 17 తేదీల్లో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమవారం అక్టోబర్ 14న ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లుగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు విషయాన్ని గమనించి కలెక్టరేట్ కార్యాలయానికి వ్యయ ప్రయాసలకోర్చి రావద్దని, జిల్లాకు భారీవర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.