వడమాలపేట మండలం పూడి క్రాస్ రోడ్డు వద్ద గల అంకాలపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం సాయంత్రం దీపావళి, అమావాస్య సందర్భంగా విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆవు పాలతో అభిషేకించి, పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు జగద్గురు స్వామి ధూపదీప నైవేద్యములను సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త పీతాంబరం ఆచారి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమ పూజలు చేశారు.