తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎ. యం. పురం ఎస్టీ కాలనీకి చెందిన మూడున్నరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని.. గిరిజన నవ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ నాయక్ అన్నారు. శనివారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ఆ కిరాతకుడిని బహిరంగంగా శిక్షిస్తే తప్పా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.