బోయకొండ ఆలయ ఛైర్మన్ పదవితో పాటు వాల్మీకి, బోయలను ఎస్టీలుగా పునరుద్ధరించాలని కోరుతూ.. ఆ సంఘ నాయకుడు శ్రీనివాసులు చేపట్టిన పాదయాత్ర ఆదివారం పుంగనూరు పట్టణానికి చేరింది. ఈ నేపథ్యంలో స్థానిక ఇందిరా కూడలిలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. తర్వాత అక్కడి నుంచి బోయకొండకు పాదయాత్రగా తరలి వెళ్లారు. వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.