చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గ ఖాజీగా డాక్టర్ మౌలానా మొహమ్మద్ ఎజాజ్ని నియమిస్తూ టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి హర్షవర్ధన్ సోమవారం
ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుహేల్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.