వి.కోటలో భారీగా మోహరించిన పోలీసులు
వి. కోటలో నిన్న జరిగిన ఇరువర్గాల ఘర్షణ కారణంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ 144 సెక్షన్ అమలు చేయడం విధితమే. ఇంకా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా వి. కోటకు మంగళవారం భారీగా పోలీసులను పంపారు. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని వీ. కోట మండల ప్రజలు భయభ్రాంతులతో గురవుతున్నారు. ఎక్కడైనా గుంపులు గుంపులుగా కనబడితే వెంటనే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.