చిత్తూరులో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 22 మంది రౌడీ షీటర్లకు ఆదివారం సీఐ జయరామయ్య కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా వాళ్లకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. అల్లర్లు సృష్టించిన, శాంతి విఘాతం కలిగించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.