తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తాం: జిల్లా ఎస్పీ

75பார்த்தது
చిత్తూరు జిల్లా వికోట మండలంలో సోమవారం జరిగిన ఘర్షణ పై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మంగళవారం విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిందన్నారు. ఇరు వర్గాలతో చర్చించి, తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో గుంపులు గుంపులుగా ప్రజలు తిరగరాదన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు.