చిత్తూరు జిల్లా వీకోటలో జరిగిన దాడి పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన డీఎస్పీ ప్రభాకర్ కు గాయాలయ్యాయి. మసీదు వీధిలో జరిగిన రాళ్ల దాడిలో డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే దాడిలో పూతలపట్టు సీఐ కృష్ణ మోహన్ కు, ఐడి పార్టీ ప్రకాశ్‌కు గాయాలయ్యాయి. వీరికి వికోట ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి తెలుసుకున్న చిత్తూరు కలెక్టర్, ఎస్పీలు మంగళవారం వీకోటకు చేరుకుని వారిని పరామర్శించారు.