భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, నగరపాలక సంస్థ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. చిత్తూరు నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, లోతట్టు ప్రాంతాలు, పెద్ద కాలువల్లో పర్యటించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా ముగ్గురు అధికారులు, సహాయకులను నియమించారు. అత్యవసర పరిస్థితులకై 98499 07885 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.