నగరి పట్టణంలో చావిడి వద్ద వున్న కరకంఠేశ్వర స్వామి ఆలయంలో శనివారం నుండి స్కంద షష్ఠి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము జరిపారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తిని అలంకరించి మండపంలో వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు దుర్గా ప్రకాష్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు దేవస్థానము తరఫున ప్రసాద వితరణ గావించారు.