పుత్తూరు మండలంలోని పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏజీఎం సురేష్ మాట్లాడుతూ.. మానవ జీవితంలో బాల్యం ఓ వరం, కల్మషం లేని నవ్వు, అభం శుభం తెలియని పసితనం, అందరితో ఆడుకునే నైజం పిల్లల్లో మాత్రమే ఉండే గొప్ప గుణమని తెలుపుతూ, పిల్లలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ఇన్ ఛార్జ్ సౌమ్య, ఫ్రీ ప్రైమరీ ఇన్ ఛార్జ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.