గురువారం నగరి ఏరియా ఆసుపత్రిలో రూ. 34 లక్షల తుడా నిధులతో నూతన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగరి శాసన సభ్యుడు గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లో వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని, అత్యవసర మందులను హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు.