చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ. ప్రభావతి దేవి శుక్రవారం కుప్పం నియోజకవర్గంలోని వివిధ పిహెచ్సిలను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సూపర్వైజర్లు క్లోరినేషన్ పిహెచ్ నందు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసులు, పిహెచ్సి డాక్టర్లు పాల్గొన్నారు.