రామకుప్పం మండలం వీర్నమల పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఆదివారం గంజాయి స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పలుచోట్ల సుమారు ఒకటిన్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 40కి పైగా ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.