రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం లభించింది. శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రికి గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి, రాయల దక్షిణ కోస్తా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు డాక్టర్ యుగంధర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఆ తర్వాత ఆయనకు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు.