ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య శుక్రవారం తెలిపారు. ఇరువారం వద్ద వరదరామి - చిత్తూరు వన్ టౌన్ బస్సు డ్రైవర్, కండక్టర్ పై గొడవ పడి దాడి చేసిన ఉమదురై, రవి మరో ఇద్దరిపై కేసు నమోదు చేయగా, ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని మరో ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు.