చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి సోమవారం ప్రపంచ అయోడీన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా అయోడీన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు.అయోడీన్ లేమి వల్ల థైరాయిడ్ సమస్యలు,గర్భస్రావం,చెవిటితనం, బుద్ధిమాంద్యం,మరియు బలహీనతలు వస్తాయని తెలిపారు. రోజువారీ ఆహారంలో సముద్రపు చేపలు, పాలు,గుడ్డు పచ్చసొన, అయోడైజ్డ్ ఉప్పు వాడాలని, క్యాబేజీ వంటి పదార్థాలు తక్కువగా తీసుకోవాలని సూచించారు.