ఉమ్మడి చిత్తూరు జిల్లా
వైసీపీ అధ్యక్షుడుగా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్
జగన్ మోహన్ రెడ్డి నియమించడం విదితమే. ఈ మేరకు ఆయన నవంబర్ 3న బాధ్యతల స్వీకారం చేయనున్నారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న బహిరంగ స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం భూమనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సభాస్థలిని పరిశీలన చేశారు.