చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ మంగళవారం సవాలు విసిరారు. అలాగే నాని భార్య సుధా రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. ఏడు వేల రూపాయల జీతానికి పనిచేసిన చెవిరెడ్డి వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో తెలపాలని డిమాండ్ చేశారు.