తెనాలి డిపో నుంచి పంచరామాలకు ప్రత్యేక బస్సులు

81பார்த்தது
తెనాలి డిపో నుంచి పంచరామాలకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం సందర్భంగా ప్రతి శని, ఆదివారాలలో తెనాలి డిపో నుంచి పంచరామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి పుణ్యక్షేత్రాలను ఒక్క రోజులోనే దర్శించుకుని తెనాలి చేరుకోవచ్చని అన్నారు. సూపర్ లగ్జరీ బస్సు కు రూ. 1270, లగ్జరీ బస్సుకు రూ. 1200 ఛార్జీలుగా నిర్ణయించామన్నారు.

தொடர்புடைய செய்தி