కాకుమాను ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జడ్పిటిసి సభ్యురాలు ముజావర్ గుల్జార్ బేగం మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు అధికారులు సహకరించాలని సూచించారు. త్రాగునీరు, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరారు. ఎంపీడీవో యుగకీర్తి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.