గుంటూరు జిల్లా పొన్నూరు మండలం గోళ్ళమూడి పాడు గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రూ. 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్లు, డ్రైన్లు ప్రారంభించారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. మండల స్థాయి అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.