అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేయించుకోవడానికి సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన చింతలపూడి రామాంజనేయులు, నిడుబ్రోలుకు చెందిన కాటూరి దేవేంద్రనాథ్, పొన్నూరుకు చెందిన షేక్ దిల్షాద్ బేగంలకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.