పెదకాకాని గ్రామం తెదేపా నాయకుడు దానబోయిన సాంబశివరావు చిన్నకుమారుడు మహేష్ (22), నండ్రు శైలు (20)ల ప్రేమ వివాహం చేసుకొనుటకు తల్లితండ్రులు అంగీకరించకపోవడంతో శుక్రవారం పెదకాకాని గ్రామం భ్రమరాంబ కాలనీ అండర్ రైల్వే బ్రిడ్జి పైన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సంఘటన స్థలం కు వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.