భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం పై దాడి హేయమైన చర్య అని కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. శనివారం కనిగిరి పట్టణంలోని స్థానిక పామూరు బస్టాండ్ లో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ విధమైన దాడులు మానుకో పోతే రానున్న రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.