మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం పల్నాడు జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి గీతాంజలి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని టీకాల విభాగాన్ని సందర్శించి వ్యాక్సిన్లు అందజేస్తున్న పనితీరును డాక్టర్ ప్రసాదును అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు సకాలంలో టీకాలు వేయాలని, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మాచవరం సచివాలయాలను ఆమె సందర్శించారు. ఏఎన్ఎంలకు సూచనలు అందజేశారు.