గుంటూరు: ప్రతిరోజు కార్మికుల హాజరును పంపాలి: కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులు పారిశుద్ధ్య పనులు కాకుండా ఇతర విధుల్లో ఉంటే తక్షణం వారికి ఆయా శానిటరీ డివిజన్లలో పారిశుద్ధ్య విధులు కేటాయించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం కమిషనర్ నాజ్ సెంటర్, నల్లచెరువు మస్టర్ పాయింట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకల్లా కార్మికుల హాజరు తనకు పంపాలన్నారు.