ఉచిత గ్యాస్ సిలిండర్ పేరిట కూటమి ప్రభుత్వం అరకొరగా లబ్ధిదారులను ఎంపిక చేసిందని వైసీపీ దుయ్యబట్టింది. దాదాపు అర కోటి మందిని ఈ పథకానికి దూరంగా ఉంచిందని ఎక్స్‌లో ఆదివారం పోస్టు పెట్టింది. ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడానికి రూ.4 వేల కోట్లు అవసరమైతే.. కూటమి ప్రభుత్వం రూ.2,684.75 కోట్లు ఇస్తోందని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలో 1.80 కోట్ల కుటుంబాలు ఉన్నాయని, 1.54 కోట్ల యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని పేర్కొంది.